Sunday, January 19, 2025
HomeTrending NewsPawan Kalyan: 'పాపం పసివాడు' సినిమా తీయాలి: పవన్ సెటైర్

Pawan Kalyan: ‘పాపం పసివాడు’ సినిమా తీయాలి: పవన్ సెటైర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పాపం పసివాడు’ సినిమా పేరును ప్రస్తావిస్తూ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైఎస్సార్​ మత్స్యకార భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌‌, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సీఎం జగన్​ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జనసేనాని వ్యంగంగా ట్వీట్ చేశారు. జగన్​పై ‘‘పాపం పసివాడు’’ టైటిల్​తో సినిమా తీయాలంటూ పవన్ కల్యాణ్ చురకలంటించారు.

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan గారితో ఎవరైనా ఈ సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. అతని చేతిలో ‘సూట్‌కేస్’కి బదులుగా తన అక్రమ సంపాదనను సుగమం చేసే మనీ లాండరింగ్‌ కోసం పెట్టుకున్న ‘సూట్‌కేస్ కంపెనీలను’ ఉంచండి. ఏపీ సీఎం గారూ.. మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారో, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారో కాదు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో.. వర్గ పోరు (క్లాస్ వార్) అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో ఒక రోజు మీ నుంచి, మీ బ్యాచ్ నుంచి ‘రాయలసీమ’ విముక్తమవుతుందని ఆశిస్తున్నాను. PS: ఈ కథకు రాజస్థాన్ ఎడారులు కావాలి. కానీ వైసీపీ మన ఏపీలో నదీ తీరాల నుంచి ఇసుక దోచేసింది. కలెక్షన్ పాయింట్లలో తగినన్ని ఇసుక దిబ్బలు ఉన్నాయి. ఛీర్స్!!” అంటూ పవన్​ విమర్శలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్