Wednesday, April 2, 2025
Homeసినిమాచిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులు : పవన్‌కల్యాణ్‌

చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులు : పవన్‌కల్యాణ్‌

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంగా పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఇప్పటివరకూ దాదాపు 30శాతం మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, మనోజ్‌, మోహన్‌బాబు, మంచు లక్ష్మి, సుమ, శ్రీకాంత్‌, నరేశ్‌, శివాజీరాజా, ఉత్తేజ్‌, శివబాలాజీ, సుడిగాలి సుధీర్‌, రాఘవతోపాటు పలువురు సీనియర్‌ నటీనటులు ఓటు వేశారు.

ఓటు వేసిన అనంతరం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఇంత హడావుడి అవసరం లేదన్నారు. సినీ నటులు ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ ఎన్నికల వల్ల సినీ ఇండస్ట్రీ చీలిపోదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్