Sunday, January 19, 2025
HomeTrending Newsపవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టారే: డా. సీదిరి

పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టారే: డా. సీదిరి

పవన్ కళ్యాణ్ ఎంత ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుతో కలిశారో చెప్పాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. ‘కొడకల్లారా.. కర్రలు, రాళ్లు, హాకీ స్టిక్‌లు… అంటూ పవన్ మాట్లాడడం ఆశర్యంగా ఉంది’ అన్నారు.  పవన్‌ను పరామర్శించడానికి చంద్రబాబు పరిగెత్తుకుంటూ వచ్చారని ఎద్దేవా చేశారు.  పవన్ ను ప్యాకేజీ స్టార్‌ అనక ఏమనాలని, ఒక వేల నిజంగా ప్యాకేజీ తీసుకోలేదని నిరూపించుకోవాలి అనుకుంటే 175 స్థానాలకు పొటీ చేస్తానని ప్రకటించాలని మంత్రి సవాల్ చేశారు.

ఉత్తరాంధ్రులను గుండెల మీద తన్నడానికి, ప్రజలను రెచ్చగొట్టదానికే పవన్ విశాఖ టూర్ పెట్టుకున్నారని అప్పలరాజు ఆర్పించారు.  ప్రజలను రెచ్చగొట్టే, విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం కాదా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయినప్పుడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే బాగుండేదనన్నారు. ప్రజలు 23 సీట్లు ఇచ్చి చంద్రబాబును ఇంటికి పంపారని, ఇపుడు సిఎం జగన్ ను గద్దె దించేందుకు  ఊర కుక్కలు ఏకమవుతున్నాయి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  పవన్‌కు కుటుంబ విలువలు అన్నా,  నైతికత అన్నా తెలియదని దుయ్యబట్టారు.

Also Read కలిసి పోరాడదాం: బాబు-పవన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్