Sunday, January 19, 2025
Homeసినిమాప‌వ‌న్, తేజు మ‌ల్టీస్టార‌ర్ సెట్స్ పైకి వ‌చ్చేది ఎప్పుడు..?

ప‌వ‌న్, తేజు మ‌ల్టీస్టార‌ర్ సెట్స్ పైకి వ‌చ్చేది ఎప్పుడు..?

From August: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారు. అయితే.. భీమ్లా నాయ‌క్ అంటూ ఈమ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నాడు. క్రిష్ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న  ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల‌లో షూటింగ్ చేయాలి అనుకున్నారు కానీ.. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు.హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాతో పాటుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సాయిధ‌ర‌మ్ తేజ్ తో చేయ‌నున్న మూవీకి కూడా ఓకే చెప్పారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ మూవీని జూన్ సెకండ్ వీక్ లో స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ప‌వ‌న్ దీనికి గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

అయితే.. ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. ప‌వ‌న్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డంతో షూటింగ్ కి బ్రేక్ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. మ‌రి.. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే.. ఆగ‌ష్టు లేదా సెప్టెంబ‌ర్ లో అని స‌మాచారం. త‌మిళంలో విజ‌యం సాధించిన వినోద‌య సీతం అనే సినిమాకి ఇది రీమేక్. ఫ‌స్ట్ టైమ్ మేన‌మామ‌, మేన‌ల్లుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టిస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. ప‌వ‌న్, తేజ్ క‌లిసి ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read : ‘..వీర‌మ‌ల్లు’పై ప‌వ‌న్ అసంతృప్తి నిజ‌మేనా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్