నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ కాంబినేషన్ సెట్ అయితే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యిందని తెలిసింది. అయితే.. ఇది సినిమా కోసం కాదు.. అన్ స్టాపబుల్ టాక్ షో కోసమని సమాచారం. ఇంతకీ మేటర్ ఏంటంటే.. బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది.
అయితే… అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ కి సరైన గెస్ట్ లు కావాలి. అందుకోసం వెదుకులాట ప్రారంభమైంది. అన్ స్టాపబుల్ రెండో సీజన్ ను సరైన కాంబినేషన్ తో ప్రారంభించడానికి చూస్తున్నారు. పవన్, త్రివిక్రమ్ ని బాలయ్య ఇంటర్ వ్యూ చేస్తే బాగుంటుందని అనుకున్నారట ఆహా టీమ్. ఈ ప్రపోజల్ కు పవన్, త్రివిక్రమ్ కూడా సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అయితే.. ఇది ఫైనల్ కావాల్సివుంది.
పవన్, త్రివిక్రమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. ఇక స్టార్ట్ చేయాల్సింది షూటింగే. ఈ నెల 26 నుంచి వారం రోజులు అన్ స్టాపబుల్ సెట్ మీదకు బాలయ్య వస్తున్నారు. దీనికి ఓపెనింగ్ షాట్ ను దుబాయ్ లో లేదా టర్కీలో చిత్రీకరించే అవకాశం వుంది. ప్రస్తుతం బాలయ్య టర్కీలో షూటింగ్ లో ఉన్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగి పవన్, త్రివిక్రమ్ ని బాలయ్య ఇంటర్ వ్యూ చేస్తే.. అభిమానులకు పండగే. ఈ ఇంటర్ వ్యూ ఆహా ఓటీటీలో సంచలనం సృష్టించడం ఖాయం అని చెప్పచ్చు.
Also Read: బాలయ్య అన్ స్టాపబుల్-2 ఎప్పుడు?