Saturday, January 18, 2025
HomeసినిమాPawan Kalyan: 'వీరమల్లు'కు పవన్ డేట్స్ ఇచ్చారా?

Pawan Kalyan: ‘వీరమల్లు’కు పవన్ డేట్స్ ఇచ్చారా?

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి క్రిష్ డైరెక్టర్. ఈ భారీ, క్రేజీ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు. ఒకనొక దశలో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. పాపం.. క్రిష్ మాత్రం ఈ సినిమానే నమ్ముకుని గత కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉండిపోయారు. మంచి చిత్రాలు చేయాలని తపించే క్రిష్ ఇలా ఒక సినిమా కారణంగా సైలెంట్ అయిపోవడం బాధాకరమే.

ఇదిలా ఉంటే.. వీరమల్లు మరోసారి వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటంటే… పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు వీరమల్లు కి డేట్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ రెండోవారంలో పవర్ స్టార్ ఈ షూటింగ్ లో జాయిన్ కానున్నారని అంటున్నారు. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మరి కొంత మంది తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని ప్రచారం జరుగుతుంది. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

అయితే.. ఓ వైపు ఓజీ కంప్లీట్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా సంక్రాంతికి తీసుకురావాలి అనేది ప్లాన్. ఇలాంటి టైమ్ లో ఈ రెండు సినిమాలకు కాకుండా వీరమల్లుకు టైమ్ ఇవ్వరనే మరో వాదన కూడా వినిపిస్తోంది. చూస్తుంటే.. నిజమే అనిపిస్తుంది. అందుకనే క్రిష్ వేరే సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. అయితే.. ఎక్కువుగా రీమేక్స్ చేస్తున్న పవర్ స్టార్ నుంచి వస్తున్న స్ట్రైయిట్ మూవీ కావడం.. ఇది రాజుల కాలం నాటి కథ కావడం.. దీనికి క్రిష్ డైరెక్టర్ కావడంతో అభిమానుల్లోనూ కామన్ ఆడియన్స్ లోనూ వీరమల్లు పై మరింతగా ఆసక్తి ఏర్పడింది. మరి.. వీరమల్లు ఎప్పుడు పూర్తవుతుందో..?  థియేటర్లోకి ఎప్పుడు వస్తాడో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్