జగన్ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారని, గత ఎనికల్లో ఒక్క ఛాన్స్ మాయలో పడిపోయిన జనం ఈసారి చిత్తుగా ఓడించి ఈ పాలనకు చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన రోడ్ షో లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రజలు పెద్దఎత్తున హారజయ్యారు, జనాన్ని చూసిన బాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.. తాను గతంలో చాలాసార్లు బొబ్బిలి వచ్చానని, కానీ ఈ పర్యటనలో పాల్గొన్న జనం స్పందన, భారీ ఎత్తున హాజరు కావడం దేనికి సంకేతమని, ప్రజలంతా విసుగెత్తి ఉన్నారని, అందుకే నెల ఈనిందా అనే స్థాయిలో ప్రజలు వచ్చారని వ్యాఖ్యానించారు. జగన్ కు ధీటుగా మీడియాపై బాబు విమర్శలు చేశారు. సాక్షి, టివి9, NTV లకు ప్యాకేజీ మీదే శ్రద్ధ అని, ప్రజలపై లేదని మండిపడ్డారు,
బాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు:
విశాఖ టూరిజం, ఇండస్ట్రియల్ హబ్ గా మారాలి
కానీ ఇక్కడినుంచి పరిశ్రమలు తరలి వెళ్తున్నాయి
యువతను జాబ్ కాలండర్ పేరుతో మోసం చేశారు
అమరావతిలో మూడు లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది
రాజధానికి భూములిచ్చిన రైతులు వెయ్యి రోజులుగా అందోళన చేస్తున్నారు
వైసీపీ పాలనలో ఏ రైతూ ఆనందంగా లేదు, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది
ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేని సిఎం మూడు రాజధానులు కడతాడా?
పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిన ఘనత జగన్ దే
జగన్ ను ఓడించకపోతే రాష్ట్రానికే ఇవి చివరి ఎన్నికలు అవుతాయి
బొత్స తన మేనల్లుడు చిన్న శ్రీని దోచుకోమని బొబ్బిలిలో ఊరు మీద వదిలాడు
నా రాజకీయ జీవతమంత లేదు జగన్ రెడ్డి వయసు