Sunday, January 19, 2025
HomeTrending NewsVizag Steel: పూటకో మాట సరికాదు: లక్ష్మీనారాయణ

Vizag Steel: పూటకో మాట సరికాదు: లక్ష్మీనారాయణ

విశాఖ స్టీల్ ప్లాంట్ మూలధన వ్యయం సమకూర్చడం కోసం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకూ  కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం నేటి మధ్యాహ్నం 3 గంటల వరకూ తుది గడువు అని పకటించిన యాజమాన్యం మరో ఐదు రోజులపాటు బిడ్డర్లకు అవకాశం కల్పించింది.

కాగా, ఇప్పటివరకూ ఈవోఐ లో మొత్తం 21 సంస్థలు పాల్గొన్నట్లు సమాచారం, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ కూడా బిడ్ లో పాల్గొన్నారు. అంతకుముందు ఉక్కు సంకల్ప మహా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థ గానే కొనసాగించాలని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధిని కలిగించాలని, మిగులు భూములను నిర్వాసితు కుటుంబాలకు కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నిర్వహించారు. ప్లాంట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు. ప్లాంట్ ఆర్చ్ నుంచి సింహాచలం వరకూ 20 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది.

స్టీల్ ప్లాంట్ కాపాడుకోడానికి తెలుగు ప్రజలు అందరూ ముందుకు రావాలని లక్ష్మీ నారాయణ పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ముందు చెప్పినట్లు బిడ్ దాఖలు చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం కూడా పాల్గొంటే  అంతకంటే కావాల్సింది ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ 400 రూపాయలు ఇస్తే ప్లాంట్ మనకే ఉంటుందని అన్నారు. ఫగ్గన్ సింగ్ ఉక్కు శాఖ సహాయ మంత్రి కాదని, అసహాయ మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మార్చడం సరికాదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్