Monday, May 20, 2024
HomeTrending Newsలోకేష్.. భాష జాగ్రత్త: నాని ఫైర్

లోకేష్.. భాష జాగ్రత్త: నాని ఫైర్

చంద్రబాబుది దిక్కుమాలినబతుకు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వివేకా హత్యపై టిడిపి నిన్న విడుదల చేసిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకంలో కనీసం టిడిపి పేరు గానీ, చంద్రబాబు, ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు కూడా వేసుకోలేకపోయారని మండిపడ్డారు. కేవలం జగన్ పై బురద జల్లడానికి, విషం చిమ్మడానికే ఈ పుస్తకం వేశారన్నారు. వివేకా హత్య సమయంలో ప్రభుత్వం ఎవరిది, ముఖ్యమంత్రి ఎవరు అంటూ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టిడిపి ఒక అంతర్జాతీయ పార్టీ … దాని  ఏపీకి ఒక అధ్యక్షుడు… ఆయనకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ అచ్చెన్నాయుడిపై ఫైర్ అయ్యారు.

జగన్ ను మానసికంగా ఎంత కుంగదీయాలని చూసినా అది కుదరలేదని, అందుకే ఇలాంటి పిచ్చి రాతలు, పిచ్చి పుస్తకాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. టిడిపి పుస్తకంలో జగన్ భార్య భారతమ్మ ఫోటో ప్రచురించడంపై నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సన్నాసి రాజకీయాల కోసం ఇంట్లో ఆడవారిని బైటకు లాగే టిడిపి నీచ సంస్కృతి  మరిసారి బైటపడిందన్నారు. సిఎం జగన్ పై నారా లోకేష్ ఉపయోగిస్తున్న భాషపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ అలా తయారైనందుకు ఆయన తండ్రి బాబును అనాలని వ్యాఖ్యానించారు. లోకేష్ పద్దతిగా మాట్లాడాలని,  ఒక సిఎం ను పట్టుకుని అలా మాట్లాడితే తాము కూడా బాబును అదేరకంగా మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వైఎస్ అవినాష్ రెడ్డి  నిజంగా ఆధారాలు చెరిపేసి ఉంటే నాటి పోలీస్ శాఖ, ఇంటలిజెన్స్ డిజి ఏబీ వెంకటేశ్వర రావు ఏం చేశారని, వివేకా కుటుంబాన్ని కానీ, వివేకా కూతురుని కానీ ఎందుకు విచారణ చేయించలేదని నిలదీశారు. అవినాష్ రెడ్డిని ముద్దాయిగా ఎందుకు చూపలేదని అడిగారు. సిబిఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మీకు ఎలా వచ్చిందని, అంటే ఆ వ్యవస్థలో మీకు కీలుబొమ్మలు ఉన్నారని, చంద్రబాబు డైరక్షన్ లో నడుస్తుందని అర్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ మరణాలపై ఎందుకు పుస్తకాలు వేయలేదని, వారి చావులపై ఎందుకు విచారణ కోరలేదని నిలదీశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్