Sunday, November 24, 2024
HomeTrending Newsఅసంతృప్తి ఉంటే పార్టీ మారిపోతారా?: సోము

అసంతృప్తి ఉంటే పార్టీ మారిపోతారా?: సోము

ఎవరైనా పార్టీలు మారారంటే వారికి ఓ అజెండా ఉండి ఉంటుందని, దాని గురించి తాను మాట్లాడబోనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తాను 43 ఏళ్ళుగా ఇదే పార్టీలో కొనసాగుతున్నానని, వెళ్ళిపోయిన వారి గురించి తనను అడిగితే ఎలా అంటూ ప్రశ్నించారు. కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామాపై సోము స్పందించారు. ఎవరికైనా అసంతృప్తి ఉంటే పార్టీ పెద్దలతో మాట్లాడుకోవాలని, అంతే కానీ పార్టీలు మారిపోరు కదా అన్నారు. వ్యక్తిగత సమస్యల కంటే మోడీ నాయకత్వం, అభివృద్ధి ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న సోము వీర్రాజు నేడు మదనపల్లెలో పర్యటించి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దోపిడీ కోసమే అధికారం అన్నట్లుగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. రెండు పార్టీలూ వైల్డ్ ప్లాన్ తో వెళుతున్నాయని, రాష్ట్రంలో ఒక పధ్ధతి ప్రకారం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని, టిడిపి ఆఫీసు పై దాడి, చంద్రబాబును అనపర్తిలో అడ్డుకోవడం, పట్టాభి అరెస్టు లాంటి విషయాలు ఈ కోవలోనే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు అభివృద్ధిపై ఎవరూ అడగరని అనుకుంటున్నారని సోము అభిప్రాయపడ్డారు.

మదనపల్లెలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు వెంకయ్య నాయుడు హయంలో 50కోట్లు మంజూరయ్యాయని, కానీ నాటి బాబు ప్రభుత్వం అసమర్ధత వల్ల ఆ నిధులు వెనక్కి పోయాయని సోము ఆరోపించారు. టమోటా ఎక్కువగా పండించే ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు  కేంద్రం ఆసక్తిగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచీ ఎలాంటి ప్రతిపాదనా పంపలేదని విమర్శించారు.

అమరావతి రాజధానికే బిజెపి కట్టుబడి ఉందని, నిమ్స్ ఏర్పాటు చేశామని, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అక్కడే స్థలాలు కొన్నాయని సోము వివరించారు. అమరావతి కోసం  కేంద్రం 7,500 కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించిందని,  2,500 కోట్లు నిధులు ఇచ్చిందని మొత్తం పదివేల కోట్లు ఇస్తే వాటితో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తాను ఈ విషయం మాట్లాడితే బాబుకు సోము వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read :  బిజెపికి కన్నా రాజీనామా, టిడిపిలో చేరిక!

RELATED ARTICLES

Most Popular

న్యూస్