Watch- Voice of the People సంస్థ దళిత బంధు స్కీమ్ పై దాఖలు చేసిన ప్రజా వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు. ఈ వాజ్యాన్ని సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ భార్గవ్ దాఖలు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 76 దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున Rs.7, 60, 00,000/- (vide Lr. No. AAO/421/TSC/LPS/20201), తేదీ: 05.07.2021 న తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేసిన దానిపై వ్యాజ్యం దాఖలైంది.
ఈ వ్యాజ్యంపై హైకోర్టు అడ్వకెట్ జనరల్ ను వివరణ కోరగా, ప్రభుత్వం వైపు నుండి అడ్వకేట్ జనరల్ వాదనలను వినిపిస్తూ ప్రభుత్వం దళితులను ఆప్లిఫ్ట్ లోకి తీసుకువచ్చేటందుకు, దళిత్ ఎంపోవర్మెంట్ గురించి ఏర్పాటు అయిన ప్రతిష్టాత్మకమైన స్కీమ్ అని కోర్టుకు వివరించారు.
పిటిషనర్ కౌన్సిల్ శేషికిరణ్ వాదనలు వినిపించారు. ఆ 76 కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు ఇవ్వాలని, ఈ స్కీంకు చెందిన జీ.ఓ లు వెబ్ సైట్ లో లేవని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబం చొప్పున పది లక్షలు అందరికీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన జీ.ఓ ల ను వెబ్ సైట్ లో 24 గంటలలో పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ భార్గవ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను ముగించిన హై కోర్టు.