Saturday, November 23, 2024
HomeTrending Newsమళ్లీ పెరిగిన ఇంధన ధరలు

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​పై 50పైసలు, లీటర్​ డీజిల్​పై 55పైసలు వడ్డిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గుంటూరులో డీజిల్ ధర సెంచరీ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు మళ్లీ  పెరగటంతో వినియోగదారులు బెంబేలేతుతున్నారు. దిల్లీలో లీటర్ పెట్రోల్​పై 50 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ డీజిల్​పై 55 పైసలు వడ్డించాయి. దీంతో పెట్రోల్ ధర రూ.99.11కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.90.42కు ఎగబాకింది.

ప్రధాన మెట్రో నగరాల్లోనూ ఇంధన ధరలు పెరిగాయి. దీంతో  వారం రోజుల వ్యవధిలో ఐదుసార్లు ధరలు పెరిగినట్లైంది. ముంబయిలో లీటర్ పెట్రోల్​పై 53 పైసలు, డీజిల్​పై 58 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.113.88కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.98.13గా ఉంది. తాజా బాదుడు తర్వాత.. చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.90, డీజిల్ ధర రూ.95గా ఉంది.  కోల్​కతాలో లీటర్ పెట్రోల్ రూ.108.53, డీజిల్ రూ.93.57 పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 57 పైసలు, డీజిల్​పై 60 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో నగరంలో పెట్రోల్ ధర రూ.112.35కు పెరిగింది. డీజిల్ ధర రూ.98.68కి చేరుకుంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర 55 పైసలు పెరిగి.. రూ.113.08కు చేరింది. డీజిల్ లీటర్ ధర 58 పైసలు అధికమై.. రూ.99.09కు ఎగబాకింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 54పైసలు అధికమై.. రూ.114.36కు చేరుకుంది. డీజిల్ ధర వంద రూపాయలు దాటింది. 57 పైసల పెంపుతో రూ.100.33కు చేరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్