Saturday, January 18, 2025
Homeతెలంగాణసంతోష్  ను అభినందించిన ప్రధాని

సంతోష్  ను అభినందించిన ప్రధాని

టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ అద్భుతమని మోడీ కొనియాడారు. దీని గురించి తెలుసుకొని మనసు ఉప్పొంగిందని సంతోష్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.  ప్రధాని ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని సంతోష్ వెల్లడించారు, ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సమాజానికి ఉపయోగపడేకార్యక్రమం ఏదైనా చేయాలనే తలంపుతోనే మూడేళ్ళ క్రితం ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంతోష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసియార్ కు పచ్చదనం అంటే ఎంతో అభిమానం ఉందని, అందుకే ముఖ్యమంత్రి కాగానే ‘తెలంగాణకు హరితహారం’ మొదలు పెట్టారని, ఆయన స్పూర్తితోనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని వివరించారు. ఈ మూడేళ్ళలో ఎంతోమంది నాయకులు, సినీ నటులు, సామాజిక వేత్తలు మద్దతు పలికి ప్రోత్రహించారని సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్