Sunday, January 19, 2025
HomeTrending Newsనేడు రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన

నేడు రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన

PM Tour:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. భీమవరంలో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధాని ప్రారంభిస్తారు.  దేశానికి స్వతంత్రం లభించి 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో  ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ పేరుతో కేంద్ర పర్యాటక శాఖ జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వతంత్ర  సమరంలో అసువులు బాసిన, లబ్ధ ప్రతిష్టులైన మహనీయుల జయంతి ఉత్సవాలలో  భాగంగా అల్లూరి జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా ఏడాది పాటు దేశంలోని పలు నగరాల్లో ఘనంగా జరపనున్నారు.

భీమవరం సమీపంలో పెద్ద అమిరం వద్ద 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని రేపు  ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. ఏపీ సిఎం జగన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తదితరులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.

సభ ఏర్పాట్లను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ లు స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్