Saturday, January 18, 2025
HomeTrending Newsఅల్లూరి జయంతి ఉత్సవాలకు ప్రధాని: కిషన్ రెడ్డి

అల్లూరి జయంతి ఉత్సవాలకు ప్రధాని: కిషన్ రెడ్డి

PM Visit: మన్నెం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 4న భీమవరంలో ప్రారంభిస్తారని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్నసందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అల్లూరి జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని ప్రధాని మోడీ నిర్ణయించారని, ఈ జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకూ ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వివరించారు. అల్లూరి సంచరించిన ప్రాంతాలతో పాటు వారు బలిదానం చేసిన చోట కూడా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులతో కలిసి అల్లూరి స్వగ్రామం  మోగల్లును కిషన్ రెడ్డి సందర్శించి అల్లూరి విగ్రహానికి,  ECIL వ్యవస్థాపకులు ఏఎస్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీతారామరాజు ధ్యాన మందిరాన్ని సందర్శించి, అక్కడ ఒక మొక్కను నాటి,  గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత కుముదవల్లి లో 1897లో స్థాపించబడిన వీరేశలింగ కవి సమాజ గ్రంధాలయాన్ని కిషన్ రెడ్డి సందర్శించారు. గ్రంధాలయం అభివృద్ధి కొరకు, ప్రత్తిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ద్వారా తరపున తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్