Friday, October 18, 2024
HomeTrending Newsహిమాచల్ లో పోలింగ్ ప్రారంభం

హిమాచల్ లో పోలింగ్ ప్రారంభం

హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ మెుదలైంది. 68 అసెంబ్లీ స్థానాలు గల హిమాచల్ లో ఒకే దఫా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబరు 18న జరగునుంది. మెుత్తం 55,07, 261 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించకోనున్నారు. రాష్ట్రమెుత్తంగా 7, 881 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పంజాబ్ లో అధికారం చేజిక్కించుకున్న ఆప్ అదే జోరుతో హిమాచల్ లో బిజెపి, కాంగ్రెస్ లను ఉడ్చేయాలని చూస్తోంది. అటు బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. అయితే ఆపిల్ రైతులు బిజెపి పట్ల ఆగ్రహంగా ఉన్నారనే…ప్రచారం కమలనాథులను కలవరపరుస్తోంది.  మరోవైపు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న హామీతో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది. 2017 హిమాచల్ శాసనసభ ఎన్నికల్లో 44 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.

మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ చేస్తుండగా.. ఆప్ 67 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. 2022 హిమాచల్ ఎన్నికల కోసం 24 మంది మహిళలు మరియు 388 మంది పురుష అభ్యర్థులు సహా 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మెుదటిసారి ఓటువేయనున్న యువ ఓటర్లు-1,86,681. అతిపెద్ద ఎన్నికల అభ్యర్థిగా కాంగ్రెస్ కు చెందిన సోలన్ నుండి కల్నల్ ధని రామ్ షాండిల్ (82) నిలిచారు. పార్టీ నామినేషన్ తిరస్కరణకు గురైన కాంగ్రెస్ రెబల్ గంగూరామ్ ముసాఫిర్ (77) పచ్చడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బిలాస్‌పూర్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన పియూష్ కంగా (26) అతి పిన్న వయస్కుడు.

హిమాచల్ కా సంకల్ప్, కాంగ్రెస్ హాయ్ వికల్ప్.. నినాదంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధ్‌బరి (ధర్మశాల), బారా భంగల్ (బైజ్‌నాథ్) మరియు ధిల్లాన్ (కసౌలి) అనే మూడు సహాయక పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మారుమూల జిల్లా అయిన చంబా, డల్హౌసీలోని మనోలా పోలింగ్ స్టేషన్‌లో అత్యధికంగా 1,459 మంది ఓటర్లు ఉండగా, భర్మూర్‌లో 84 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. 15 నియోజకవర్గాలను కలిగి ఉన్న కాంగ్రాలో అత్యధికంగా 1,511 మంది ఓటర్లు సిధాబరిలో ఉండగా, అత్యల్ప పోలింగ్ స్టేషన్ నూర్పూర్‌లోని కలాంగన్‌లో 75 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మారుమూల పోలింగ్‌ కేంద్రం షాపూర్‌ నియోజకవర్గంలోని మంచ్‌లో పోలింగ్‌ పార్టీ 7 కి.మీ నడిచి వెళ్లాలి. మరో మారుమూల జిల్లా లాహౌల్-స్పితిలోని కాజాలో 811 మంది ఓటర్లు ఉండగా, లింగర్‌లో 38 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.

కులు జిల్లా మనాలి నియోజకవర్గంలో 1,305 మంది ఓటర్లతో చిచోంగా పోలింగ్ స్టేషన్ ఉండగా, బంజర్ యొక్క పోలింగ్ స్టేషన్ టిల్గాలో అత్యల్పంగా 89 మంది ఓటర్లు ఉన్నారు. 10 అసెంబ్లీ స్థానాలు కలిగిన రెండవ అతిపెద్ద జిల్లా అయిన మండి, సుందర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని చౌగన్ పోలింగ్ స్టేషన్‌లో అత్యధికంగా 1,403 మంది ఓటర్లను కలిగి ఉండగా, జరతు పోలింగ్ స్టేషన్‌లో అత్యల్పంగా 95 మంది ఓటర్లు ఉన్నారు. మంఝగన్ జిల్లాలోని రిమోట్ పోలింగ్ స్టేషన్ ను చేరుకోవడానికి 10 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. హమీర్‌పూర్ నియోజకవర్గం స్వాహాల్ పోలింగ్ స్టేషన్‌లో అత్యధికంగా 1,283 మంది ఓటర్లను కలిగి ఉండగా, బార్సర్ నియోజకవర్గం బల్హ్ ధత్వాలియన్ పోలింగ్ స్టేషన్‌లో అత్యల్పంగా 105 మంది ఓటర్లను కలిగి ఉంది. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉన్న సిమ్లా జిల్లా చోపాల్ అసెంబ్లీలోని చరోలి పోలింగ్ స్టేషన్‌లో అత్యధికంగా 1,298 మంది ఓటర్లు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్