మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి కాంబినేషన్లో. ఈ భారీ, క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా అప్ డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ కి ఆతర్వాత బ్రేక్ పడింది. కృష్ణ మరణంతో ఈ సినిమా తాజా షెడ్యూల్ మరింత ఆలస్యం అవుతుంది.
అయితే.. ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మేటర్ ఏంటంటే.. ఇందులో ముగ్గురు భామలు నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఎవరా ముగ్గురు భామలు అంటే… మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేను ఎంపిక చేశారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉందట. ఆ పాత్ర కోసం శ్రీలీలను ఫైనల్ చేశారని తెలిసింది. మరి.. మూడో హీరోయిన్ ఎవరంటే… ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటను తమన్నాతో చేయించాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
పూజా హేగ్డే, శ్రీలీల, తమన్నా.. ఈ ముగ్గురు మహేష్ మూవీలో నటించనున్నారనేది ఆసక్తిగా మారింది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా అందరికీ నచ్చేలా త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓకేసారి ఈ భారీ, క్రేజీ మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెలలోనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఆగష్టులో ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం. మరి.. మహేష్, త్రివిక్రమ్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
Also Read : మహేష్ మూవీపై క్లారిటీ ఇచ్చిన థమన్