Saturday, January 18, 2025
Homeసినిమావిజ‌య్ స‌ర‌స‌న జాన్వీనా?  పూజానా?

విజ‌య్ స‌ర‌స‌న జాన్వీనా?  పూజానా?

Who’s Chance: సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లైగ‌ర్ సినిమా ఆగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం విజ‌య్.. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా కాశ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే… ఈ సినిమా త‌ర్వాత విజ‌య్.. పూరి డైరెక్ష‌న్ లో జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాలో న‌టించ‌నున్నాడు. ఈ సినిమాని ఇటీవ‌ల అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమాని త్వ‌ర‌లో షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే… ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి కానీ.. అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు.

అయితే.. తాజాగా విజ‌య్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న పూజా న‌టించ‌డం క‌న్ ఫ‌ర్మ్ అని టాక్ వినిపిస్తోంది. దీంతో జాన్వీ నో చెప్పిందా..?  అందుక‌నే పూజాను తీసుకున్నారా..?  అనేది హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై పూరి కానీ.. విజ‌య్ కానీ.. క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : పూరి జ‌న‌గ‌ణ‌మ‌న ముహుర్తం ఫిక్స్(ఎక్స్ క్లూజీవ్)

RELATED ARTICLES

Most Popular

న్యూస్