Sunday, January 19, 2025
Homeసినిమాప‌వ‌న్ మూవీ నుంచి పూజా త‌ప్పుకుందా?

ప‌వ‌న్ మూవీ నుంచి పూజా త‌ప్పుకుందా?

Power-Pooja: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్, భీమ్లా నాయ‌క్ చిత్రాల‌తో వ‌రుస‌గా స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అనే భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీనియ‌ర్ ప్రొడ్యూసర్ ఏఎం ర‌త్నం నిర్మిస్తోన్న ఈ సినిమాని ద‌స‌రాకి రిలీజ్ చేయాల‌నేది ప్లాన్. అది కుద‌ర‌క‌పోతే.. సంక్రాంతికి విడుద‌ల చేయాలనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ అనే సినిమా చేయ‌నున్నారు.  దీనిలో ప‌వ‌న్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేను ఎంపిక చేశారు. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చేయనని పూజ హెగ్డే చెప్పినట్టుగా తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ స్టార్ట్ చేయ‌డానికి టైమ్ ప‌డుతుంది.

ఒక వైపున త్రివిక్రమ్ – మహేష్‌ సినిమాలో, మరో వైపున విజయ్ దేవరకొండ సరసన జనగణమన చేయనుంది. అంతేకాదు, బాలీవుడ్ నుంచి కూడా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. అందువల్లనే తాను పవన్ ప్రాజెక్టును చేయలేనని హరీష్‌  శంకర్ తో పూజ చెప్పినట్టుగా సమాచారం. దీంతో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ లో ప‌వ‌ర్ స్టార్ న‌టించే హీరోయిన్ ఎవ‌రు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. ఆ ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.

Also Read : ‘..వీర‌మ‌ల్లు’పై ప‌వ‌న్ అసంతృప్తి నిజ‌మేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్