Sunday, January 19, 2025
HomeTrending Newsవిద్యుత్ ప్రాజెక్టులపై కేంద్రం కుట్ర - మంత్రి జగదీష్ రెడ్డి

విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్రం కుట్ర – మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు ఋణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి తుగ్గట్టుగా సరఫరాకి అన్ని ఏర్పాట్లు చేశామని, 17000mw పైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్రలు చేస్తోందని జగదీష్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో ఆరోపించారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణను ప్రోత్సహించాల్సిన కేంద్రం వివక్ష చూపెడుతున్నదని మండిపడ్డారు. నిరంతరంగా ప్రజలకు విద్యుత్ అందిస్తున్న తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు మోకాలడ్డుతుంది కేంద్రం..రాష్ట్రానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సంస్థల రుణాలను రాకుండా కేంద్రం కుట్రలు చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణపై కేంద్ర కక్షపూరిత వైఖరిని ఖండిస్తున్నామన్న మంత్రి కేసీఆర్ వెంట నడుస్తున్న తెలంగాణ రైతుల ఉసురు తీసే కుట్రలకు కేంద్రం సిద్దపడిందని ఘాటుగా విమర్శించారు. రావాల్సిన నిధులపై చట్టప్రకారం పోరాటం చేస్తామని, విద్యుత్ అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఇతర సంస్థలు తెలంగాణకు విద్యుత్ అమ్మొద్దని  కేంద్రం బెదిరిస్తున్నదని ఆరోపించారు. విద్యుత్ సరఫరాని అడ్డుకుంటూ తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటున్నడని, కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా.. కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయరని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదేనని, బొగ్గు దిగుమతుల ధరలు, పెట్రో, డీజిల్ చార్జీలు పెరగడంతో పాటు, కేంద్రం అడ్డగోలుగా పన్నులు విధించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని వివరించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి ప్రజల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

Also Read :  గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనల సెగ

RELATED ARTICLES

Most Popular

న్యూస్