Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ పై ఫ్యాన్స్ ఒత్తిడి ఎందుకో తెలుసా?

ప్ర‌భాస్ పై ఫ్యాన్స్ ఒత్తిడి ఎందుకో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. స‌లార్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే… ప్రాజెక్ట్ కే పాన్ వ‌ర‌ల్డ్ ప్రాజెక్ట్.  భారీ బ‌డ్జెట్ తో రూపొందుతోన్న ఈ రెండు చిత్రాల  భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ రెండూ పూర్తైన త‌ర్వాత సందీప్ రెడ్డి వంగ‌తో స్పిరిట్ అనే మూవీ చేయ‌నున్నారు.

ప్ర‌భాస్-మారుతి కాంబినేషన్ లో సినిమాపై కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఫ‌స్ట్ ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు. ఆ త‌ర్వాత ఇది నిజ‌మేనని తెలిసి అంతా షాక్ అయ్యారు. ప్ర‌భాస్ ఏంటి..?  మారుతితో సినిమా చేయ‌డం ఏంటి..? అని. ఇటీవ‌ల మారుతి కూడా ప్ర‌భాస్ తో మూవీ ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్ప‌డంతో ఇక ప్రాజెక్ట్ ఫిక్స్. అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డ‌మే త‌రువాయి అనుకున్నారు.

ఇటీవ‌ల మారుతి తెర‌కెక్కించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ్లాప్ అయ్యింది. దీంతో మారుతితో సినిమా వద్దు అంటూ అభిమానులు ఒత్తిడి చేస్తున్నార‌ట‌. అలాగే సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ కూడా ఈ సినిమా వద్దని చెప్పార‌ట‌. దీంతో ప్ర‌భాస్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని ఈ మూవీ ఉండ‌క‌పోవ‌చ్చు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మ‌రి.. అభిమానుల ఒత్తిడి మేర‌కు మారుతితో మూవీకి నో చెబుతాడా..?  లేక ఇవేమి ప‌ట్టించుకోకుండా ఎస్ అని చెబుతాడా..? అనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్