ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగులతో ఘన విజయం సాధించింది. ప్రభాత్ జయసూర్య రెండో ఇన్నింగ్స్ లోనూ ఆరు వికెట్లతో రాణించడంతో ఈ మ్యాచ్ ను డ్రా గా ముగించాలన్న ఆసీస్ ఆశలు ఫలించలేదు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక 554 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దినేష్ చండీమల్ 204 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ కరుణరత్నే-86; కుశాల్ మెండీస్-85 పరుగులతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ పై లంక 190 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
లంక బౌలర్ ప్రభాత్ జయసూర్య ధాటికి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో తన బౌలింగ్ మేజిక్ చూపించిన ఈ యువ బౌలర్ రెండో ఇన్నింగ్స్ లోనూ ఆరు వికెట్లు సాధించి తొలి టెస్టులోనే 12 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. మహేష్ తీక్షణ, రమేష్ మెండీస్ కూడా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆసీస్ లో లాబుస్ చేంజ్-32; ఉస్మాన్ ఖవాజా-29; డేవిడ్ వార్నర్-24; కామెరూన్ గ్రీన్-23 పరుగులతో ఫర్వాలేదనిపించారు, 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో రెండో టెస్టులో లంక ఘనవిజయం సొంతం చేసుకుంది.
ఇరు జట్ల మధ్యా జరిగిన రెండు టెస్టుల సిరీస్ డ్రా గా ముగిసింది.
సంచలన బౌలర్ ప్రభాత్ జయసూర్యకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించగా, ‘దినేష్ చందీమల్’ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కింది.
మూడు టి 20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లు ఆడేందుకు శ్రీలంకలో పర్యటించిన ఆసీస్ టి 20 సిరీస్ గెల్చుకుంది. వందే సిరీస్ శ్రీలంక కైవసం చేసుకుంది.