Saturday, January 18, 2025
Homeసినిమాపవన్ మూవీ గురించి.. ప్రభాస్ కామెంట్స్

పవన్ మూవీ గురించి.. ప్రభాస్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాల్లో నటిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ ఆతర్వాత ‘భీమ్లా నాయక్’ మూవీతో మరో సక్సెస్ సాధించారు. ఆతర్వాత షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తుండడం ఆసక్తిగా మారింది. క్రిష్ డైరెక్షన్ లో ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఈ షూటింగ్ లో పవన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సమ్మర్ లో ఈ భారీ పీరియాడిక్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. గత కొన్ని రోజులుగా వపన్ కళ్యాణ్ తో సుజిత్ ఓ భారీ చిత్రం చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. ఈ సినిమాని స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు సుజిత్ తో పవన్ కళ్యాణ్‌ మూవీ అనౌన్స్ చేయడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఈ సినిమా హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి ప్రభాస్ ఊహించని రేంజ్ లో విషెస్ తెలియజేయడం విశేషం.

తన ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై స్టేటస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్ తెలుపుతున్నాను. సుజీత్ తో ఈ కాంబినేషన్ ఓ బ్యాంగ్ లా ఉంటుంది. నిర్మాత దానయ్య గారికి అలాగే సినిమా యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నానని ప్రభాస్ పోస్ట్ చేశారు. దీనితో ఇద్దరి హీరోల అభిమానులు ఈ సర్ప్రైజింగ్ పోస్ట్ మరింత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రభాస్ తో సుజిత్ సాహో అనే భారీ యాక్షన్ మూవీ అద్భుతంగా తెరకెక్కించాడు. బాలీవుడ్ ఆడియన్స్ ని సైతం మెప్పించాడు. మరి.. పవన్ కళ్యాణ్ ని సుజిత్ పవర్ ఫుల్ గా ఎలా చూపిస్తాడో..?  ఏస్థాయి విజయాన్ని సాధిస్తాడో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్