Sunday, January 19, 2025
HomeసినిమాPrabhas: ప్రభాస్, మారుతి మూవీ ఎలా ఉంటుందో తెలుసా..?

Prabhas: ప్రభాస్, మారుతి మూవీ ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రభాస్, మారుతితో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చినప్పుడు ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు. ప్రభాస్ ఏంటి..? మారుతితో సినిమా చేయడం ఏంటి..? అనుకున్నారు కానీ.. నిజంగా ప్రభాస్ మారుతితో మూవీ చేస్తున్నాడని తెలిసి అభిమానులే కాదు.. సినీ జనాలు కూడా షాక్ అయ్యారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు కానీ.. ఎంటర్ టైనర్స్ కి దూరం అయ్యాడు. అభిమానులు ఆయన నుంచి కోరుకునే ఎంటర్ టైన్మెంట్ మిస్ అవుతుంది. అందుకనే మారుతితో మూవీకి ఓకే చెప్పాడట.

అయితే.. ప్రభాస్, మారుతి మూవీని సైలెంట్ గా స్టార్ట్ చేశారు. చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుగుతుంది కానీ.. అసలు కథ ఏంటి..? జోనర్ ఏంటి..? అనేది ప్రకటించలేదు. ఇది కామెడీ హర్రర్ అని ప్రచారం మాత్రం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి నటుడు రంగస్థలం మహేష్ కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే… మారుతి సినిమాల్లో కామెడీ కామన్. కామెడీ లేకుండా ఈ దర్శకుడి సినిమాల్ని ఊహించుకోలేం. ప్రభాస్ సినిమా కూడా అదే జానర్ లో సాగుతుందని చెప్పాడు. మిస్టర్ పెర్ ఫెక్ట్, డార్లింగ్ సినిమాల్లో ఎంత ఎనర్జిటిక్ గా కనిపించాడో మారుతి సినిమాలో కూడా అలా కనిపిస్తాడని చెప్పాడు.

అలాగే ప్రభాస్ లుక్ పై కూడా చిన్న హింట్ ఇచ్చాడు. ఆమధ్య అన్ స్టాపబుల్ టాక్ షోకు ప్రభాస్ వచ్చినప్పుడు ఎలా కనిపించాడో దాదాపు అదే లుక్ మారుతి సినిమాలో కూడా ఉండబోతోందని, కాకపోతే మరింత స్టయిలిష్ గా ఉంటుందని అని రంగస్థలం మహేష్ అసలు విషయం బయటపెట్టాడు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్