Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ ఫిక్స్ అయ్యిందా..?

ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ ఫిక్స్ అయ్యిందా..?

ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నారు. ‘ఆదిపురుష్‌’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, మారుతితో మూవీ, స్పిరిట్.. ఇలా ఐదు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అదే.. సిద్ధార్థ్ ఆనంద్ తో మూవీ. సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ ఖాన్ తో ‘పఠాన్’ అనే మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే సక్సెస్ సాధించింది. దీంతో సిద్ధార్ట్ ఆనంద్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే.. సిద్ధార్థ్ ఆనంద్ మాత్రం ప్రభాస్ తో మూవీ చేయాలి అనుకుంటున్నారు.

ప‌ఠాన్ కంటే ముందు ప్రభాస్, సిద్దార్థ్ ఆనంద్ ల మ‌ధ్య భేటీ జ‌రిగింది. ప్ర‌భాస్ కూడా సిద్దార్థ్ తో ప‌ని చేయ‌డానికి సంసిద్ధంగానే ఉన్నాడు. కాక‌పోతే.. ప‌ఠాన్‌ రిజ‌ల్ట్ కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు ఆ రిజ‌ల్ట్ వ‌చ్చేసింది. సో.. ప్ర‌భాస్ తో సిద్దార్థ్ తో ప‌నిచేయ‌డానికి ఎలాంటి అభ్యంత‌రాలూ లేవు. ఈ క్రేజీ కాంబోలో మైత్రీ మూవీస్ ఓ సినిమా చేయ‌బోతోంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్ వినిపించింది. ఇప్పుడు దానికి కూడా ఆల్మోస్ట్ క్లారిటీ వ‌చ్చేసింది. మైత్రీ నిర్మాత‌లు సిద్దార్థ్ ఆనంద్‌ని క‌లిశారు. ప‌ఠాన్‌ హిట్టు కొట్టినందుకు కంగ్రాట్స్ చెప్పారు.

ప‌నిలో ప‌నిగా త‌దుప‌రి ప్రాజెక్టు పై కూడా మంత‌నాలు జ‌రిపారని సమాచారం. బాలీవుడ్‌లో నేరుగా ఓ సినిమా చేయాల‌న్న‌ది మైత్రీ ఆలోచ‌న‌. స‌ల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. ఎప్పటి నుంచో సల్మాన్ తో మైత్రీ నిర్మాతలు ట‌చ్‌లో ఉన్నారు. ప్రభాస్, సిద్దార్థ్ ఆనంద్ ల సినిమా ఓకే అయితే… దీనికే మొద‌టి ప్రాధాన్యం. సిద్దార్థ్ కి ఆఫ‌ర్లు చాలా ఉండొచ్చు కానీ.. త‌న దృష్టి మాత్రం ప్ర‌భాస్ పై ఉంది. సో… ఈ కాంబో దాదాపుగా ఖాయ‌మైన‌ట్టే. కాకపోతే ఈ ప్రాజెక్ట్ సెట్ అయినా సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్