Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ నుంచి అడ్వాన్స్ వెనక్కు?

ప్ర‌భాస్ నుంచి అడ్వాన్స్ వెనక్కు?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ‘ఆదిపురుష్‌’, ‘స‌లార్’, ‘ప్రాజెక్ట్ కే’ షూటింగుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం ఆదిపురుష్‌, స‌లార్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఆ త‌ర్వాత సంవ‌త్స‌రంలో పాన్ వ‌ర‌ల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’ రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తైన త‌ర్వాత అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ‌తో ‘స్పిరిట్’ చేయ‌నున్నారు. ఇది ప్ర‌భాస్ 25వ సినిమా అని ప్ర‌క‌టించారు.

అయితే.. ఈ సినిమాల‌తో పాటు మారుతి డైరెక్ష‌న్ లో ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌భాస్, మారుతి కాంబినేష‌న్లో మూవీని భారీ చిత్రాల ప్రొడ్యూస‌ర్ డివివి దాన‌య్య నిర్మించ‌నున్నారు. ఈ మూవీ కోసం ప్ర‌భాస్ కి యాభై కోట్లు అడ్వాన్స్ ఇచ్చార‌ట‌. అయితే.. ఏమైందో ఏమో కానీ దాన‌య్య ప్ర‌భాస్ నుంచి అడ్వాన్స్ ని వెనక్కు తీసేసుకున్నార‌ని స‌మాచారం.

 దాన‌య్య త‌ప్పుకోవ‌డంతో ఈ మూవీని నిర్మించ‌డానికి ఓ బడా ప్రొడ్యూస‌ర్ ముందుకు వ‌చ్చార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే.. రెండు బ‌డా సంస్థ‌లు క‌లిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంద‌ని తెలిసింది. మ‌రి.. ప్ర‌భాస్ ని మారుతి ఎలా చూపిస్తాడో.. ఏ రేంజ్ లో ఎంట‌ర్ టైన్ చేస్తాడో.. చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్