Sunday, January 19, 2025
HomeTrending Newsరాజా సింగ్ హత్యకు కుట్ర - శ్రీరాం సేన ఆందోళన

రాజా సింగ్ హత్యకు కుట్ర – శ్రీరాం సేన ఆందోళన

పదిరోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైద్రాబాద్ ను ముట్టడిస్తామని అఖిల భారత శ్రీరామ్ సేనా జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. రాజాసింగ్ ఎమ్మెల్యే ను కలవడానికి చర్లపల్లి జైల్ కి వెళ్తే ప్రమోద్ ను అనుమతించలేదు…దీనీపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాజాసింగ్ ఏమైనా టెర్రరిస్టా…ఏంటి ఎందుకు కలవనియరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కర్ణాటకనుండి రాజాసింగ్ ను కలవడానికి వస్తే …మూలకత్ కు అనుమతించరా అని ప్రమోద్ ముతలిక్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే రాజసింగ్ పై అక్రమ పిడియాక్ట్ పెట్టడం ఆక్షేపనీయమని ఆయన ఖండించారు. రాజాసింగ్ కు జైల్ లో ఎలాంటి సౌకర్యాలు లేవని, రాజాసింగ్ కు ఏమి జరిగిన ప్రభుత్వం కేసీఆర్ బాధ్యతా వహించాలన్నారు.

ఒక హిందువు ఎమ్మెల్యే పై ఇలాంటి అక్రమ కేసులు పెట్టి జైల్ కు తరలించడాన్ని నిరసిస్తూ భారత దేశ హిందువులందరిని ఏకం చేస్తామని ముతలిక్ వెల్లడించారు. రాజాసింగ్ పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే..లక్షలాది మందితో హైద్రాబాద్ ను ముట్టడిస్తాం…అందులో ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఒక ముస్లిం మునవర్ ఫారూఖ్ అలీ హిందువు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఎలా ఉరుకుంటామని, హిందువు దేవుళ్లను కించపరిచిన మునవర్ ఫారుకీ షోకు ప్రభుత్వం ఎందుకు పరిమిషన్ ఇచ్చిందన్నారు.

హైద్రాబాద్ లో ఆందోళనకు కారణం తెలంగాణ ప్రభుత్వమేనని, హైద్రాబాద్ పాకిస్థాన్ లో ఉందా,భారత్ లో ఉందా అని ప్రమోద్ ముతలిక్ ప్రశ్నించారు. హిందువు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టరన్నారు. తాము రాజాసింగ్ కు మద్దతుగా నిలుస్తాం…హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పది రోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే…దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరితో కలసి10రోజుల్లో హైద్రాబాద్ ను ముట్టడిస్తామని, రాజాసింగ్ హత్యకు కుట్ర కొనసాగుతున్నది..ఒక వేళ రాజసింగ్ కు ఏమి జరిగిన హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని శ్రీరామ్ సేనా జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్ హెచ్చరించారు.

Also Read :  చర్లపల్లి జైలుకు ఎమ్మెల్యే రాజాసింగ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్