Saturday, January 18, 2025
HomeTrending Newsఆర్టిసి ఉద్యోగులకు పిఆర్ సి.. సిఎం గ్రీన్ సిగ్నల్

ఆర్టిసి ఉద్యోగులకు పిఆర్ సి.. సిఎం గ్రీన్ సిగ్నల్

టిఎస్ఆర్టిసి సంస్థ ఉద్యోగులకు నిన్న బస్ భవన్ సాక్షిగా 100 కోట్ల పెండింగ్ బకాయిలు మరియు దీపావళి పండగ సందర్భంగా అడ్వాన్సులు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని మర్యాదపూర్వకంగా కలిసి సంస్థ ఉద్యోగుల పిఆర్సి గురించి టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చర్చించడం జరిగింది. పిఆర్సి అమలుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు 2017 నుండి ఆర్ పి ఎస్ పెండింగ్లో ఉంది. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించడానికి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జానార్ ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది.

దానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు రోడ్డు భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ పంపారు. టిఎస్ ఆర్టిసి సంస్థ ఉద్యోగులు మరియు అధికారుల విజ్ఞప్తి మేరకు రోడ్డు మరియు భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి పిఆర్సి అమలు చేయాలని ఈసీకి లేఖ రాయడం జరిగింది.

మునుగోడు ఉప ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అయినప్పటికీ సంస్థ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని రోడ్డు మరియు భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారిని లేఖలో కోరారు. త్వరలోనే ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయం అనంతరం ఆర్టిసి సంస్థ ఉద్యోగులకు పిఆర్సిని అమలు చేయడం జరుగుతుందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు. సంస్థ ఉద్యోగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంస్థ చైర్మన్ తెలియజేశారు.

Also Read : టిఎస్ ఆర్టిసి…హైదరాబాద్ దర్శిని 

RELATED ARTICLES

Most Popular

న్యూస్