Sunday, January 19, 2025
Homeసినిమాసంతోష్.. ఈసారైనా మెప్పిస్తాడా..?

సంతోష్.. ఈసారైనా మెప్పిస్తాడా..?

టాలీవుడ్‌లో కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ ప్రేమ్‌కుమార్‌గా న‌వ్వుల్లో ముంచెత్త‌టానికి సిద్ధ‌మవుతున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ఈ చిత్రం ద్వారా నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ప్రేమ్ కుమార్ వ్య‌థ పేరుతో ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టం అలాగే హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. హీరో పెళ్లి వ‌య‌సు వ‌చ్చింద‌ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. కానీ ఏదో ఒక కార‌ణంతో అత‌ని పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. దీంతో హీరోని అంద‌రూ ఆట ప‌ట్టిస్తుంటారు. చివ‌ర‌కు విసిగిపోయిన హీరో పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని ఓ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుంటాడు. అప్పుడు అత‌నికి హీరోయిన్ ఎలా పరిచ‌యం అవుతుంది. అస‌లు హీరోకి పెళ్లి అవుతుందా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

కథలో ట్విస్టులు మీద ట్విస్టులు ఆస‌క్తికంగా ఉన్నాయి. టీజ‌ర్‌ను వైవిధ్యంగా రిలీజ్ చేసి ఆడియెన్స్ దృష్టిని ఆక‌ర్షించిన మేక‌ర్స్‌.. ఇప్పుడు ట్రైల‌ర్‌ను అంత‌కు మించిన ఎంట‌ర్‌టైన్మెంట్‌తో మిక్స్ చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్.అనంత్ శ్రీకర్ అందించగా.. ఎడిటర్ గ్యారీ బీహెచ్ వ్యవహరిస్తున్నారు. డీఓపీగా రాంపీ నందిగం పని చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్