Dates Problem: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండడంతో సలార్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్ సరసన అందాల తార శృతిహాసన్ నటిస్తుంది. కేజీఎఫ్ 2 చరిత్ర సృష్టించడంతో సలార్ పై బాలీవుడ్ లో సైతం భారీగా క్రేజ్ ఏర్పడింది. త్వరలోనే సలార్ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే.. పృథ్వీరాజ్ సలార్ కు షాక్ ఇచ్చారని చెప్పచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ తనకు కథ చెప్పారని.. సలార్ స్క్రిప్ట్ అదిరిపోయిందని ఇటీవల పృథ్వీరాజ్ మీడియాకు చెప్పారు. అయితే.. స్టోరీ తనకు బాగా నచ్చిందని చెప్పిన ఈ నటుడు డే్ట్స్ విషయమై తనకు, ప్రశాంత్ నీల్ కు మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పారు.
ఇది ఒకరకంగా ఇది షాకే అని చెప్పచ్చు. సలార్ షూటింగ్ ఆలస్యం అవ్వడం.. పృథ్వీరాజ్ తన సినిమాలతో మలయాళంలో బిజీ కావడంతో.. డేట్స్ ఇవ్వలేక సలార్ కి డేట్స్ ఇవ్వాలా వద్దా అనేది పెండింగ్ లో పెట్టాడట. దీంతో సలార్ మేకర్స్ ఏం చేయనున్నారు..? పృథ్వీరాజ్ తో చేయించాలి అనుకున్న పాత్రకు వేరు ఆప్షన్ ఉందా..? ఎవరితో చేయంచనున్నారు..? ఫైనల్ గా పృథ్వీరాజ్ ఓకే అంటారా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. వచ్చే సంవత్సరం సమ్మర్ కి సలార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.