Sunday, January 19, 2025
HomeసినిమాGuntur Kaaram: 'గుంటూరు కారం' అసలు ప్లాన్ ఇదే

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ అసలు ప్లాన్ ఇదే

మహేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఈ అంచనాలు కాస్త రెట్టింపు అయ్యాయి. అయితే.. ఆగష్టులో రావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వలన సంక్రాంతికి వాయిదాపడింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి కానుకగా జనవరి 12న రిలీజ్ అని ప్రకటించారు కానీ… ఇంకా ఈ మూవీ నుంచి ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయకపోవడంతో పండక్కి రిలీజ్ అనేది డౌటే అని ప్రచారం మొదలైంది.

అయితే.. తాజాగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో నిర్మాత నాగవంశీ గుంటూరు కారం అసలు ప్లాన్ ఏంటి అనేది క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. ఈ మూవీ టాకీ పార్ట్ ను అక్టోబర్ 20 కు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నామని… మిగిలిన నాలుగు పాటల చిత్రీకరణ ఇయర్ ఎండింగ్ కి కంప్లీట్ అవుతుందని చెప్పారు. చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుగుతుంది. జనవరి 12న సంక్రాంతికి గుంటూరు కారం థియేటర్లోకి రావడం ఖాయం అని క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ ఆగష్టులో రిలీజ్ అనుకుని పోస్ట్ పోన్ అయ్యింది కాబట్టి ఈసారి మిస్ కాకుండా చెప్పిన డేట్ కే గుంటూరు కారం రిలీజ్ కావడం పక్కా అంటున్నారు.

హారిక అండ్ హసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దసరాకి ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సర్కారు వారి పాట.. సాంగ్స్ విషయంలో మహేష్ కాస్త అసంతృప్తిగా ఫీలయ్యారట. అందుచేత ఈ సినిమా సాంగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. మహేష్ ని పాటలతో మెప్పించడం కోసం థమన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారట. మరి.. ఈసారి ఎలాంటి ఆల్బమ్ అందిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్