తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. నిర్మల్ పట్టణంలో జయశంకర్ విగ్రహానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. జయశంకర్ సార్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, వ్యవయసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ప్రతీ ఏటా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు మారుగోండ రాము, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్ లోని టీ ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అవరణలో జరిగిన సమావేశంలో ఆయన చిత్రపటానికి పూమాల వేసి, పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించిన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కార్యక్రమంలో ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించిన మహనీయుడని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
తెలంగాణ సిద్దాంతకర్త, ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా బాన్సువాడ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి