Tuesday, January 21, 2025
Homeసినిమాఆ రెండు స్టోరీలు ఒకటేనా?

ఆ రెండు స్టోరీలు ఒకటేనా?

Brahmastra Stories  : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్నభారీ పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కె’. ఈ భారీ చిత్రానికి మ‌హాన‌టి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సుప్ర‌సిద్ధ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యానర్ పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే న‌టిస్తుంటే.. కీల‌క పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తుండ‌డం విశేషం. ఈ సినిమాని ఆ మ‌ధ్య రామోజీ ఫిలింసిటీలో చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. అమితాబ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ మూవీ స్టోరీ.. అమితాబ్, నాగార్జున‌, ర‌ణ్ భీర్ క‌పూర్ క‌లిసి న‌టిస్తున్న బాలీవుడ్ మూవీ బ్ర‌హ్మ‌స్త్ర స్టోరీ ఒక‌టే అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ స్టోరీ ఏంటంటే.. కొన్ని దశాబ్దాలు కిందట హిమాల‌య పర్వత శ్రేణుల్లో ఒక ఆయుధాన్ని దాచి వుంచుతారు. ఆ ఆయుధం కోసం జరిగే పోరాటమే బ్రహ్మాస్త్ర. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ కథకి మూలం కూడా ఇదే పాయింట్ ని తెలిసింది. అదే ఆయుధం, అవే హిమాల‌యాలు నేపధ్యంలోనే ప్రాజెక్ట్ కే వుంటుందని స‌మాచారం. బ్రహ్మాస్త్ర షూటింగ్ సగం జరిగిపోయింది. మూడు భాగాలుగా ఈ సినిమా రానుంది. ఇప్పుడు వాళ్ళు కథ మార్చరు.

నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం కేవ‌లం ఓ వారం రోజులు షూటింగ్ చేశారు. అందుచేత‌ ప్రస్తుతం కథ మార్పులు కోసం చర్చలు జరుగుతున్నాయని.. కుదిరితే బ్రహ్మాస్త్ర టీంతో కూర్చుని సిమిలారిటీస్ ని చర్చించుకొని ప్రాజెక్ట్ కే లో మార్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఏదేమైనా ముందుగా ఇలాంటి విషయాలు క్లియర్ చేసుకుంటే మంచిది. అయితే.. కొన్ని పోలికలు వుంటే మార్పులు చేసుకోవచ్చు కానీ.. మూలకథ మొత్తం ఒకేలా వుంటే మాత్రం ప్రాజెక్ట్ కె మూలకథలో కూడా మార్పులు చేయాల్సివుంటుంది. మరి.. ఏం చేయ‌నున్నారో.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్