Monday, June 17, 2024
Homeసినిమాటెన్షన్ లో 'ప్రాజెక్ట్ కే' మేకర్స్..?

టెన్షన్ లో ‘ప్రాజెక్ట్ కే’ మేకర్స్..?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంది. కీలక పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. జనవరి 12న ప్రాజెక్ట్ కే చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ప్రాజెక్ట్ కే నిజంగా సంక్రాంతికి వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. కారణం ఏంటంటే… అమితాబ్ బచ్చన్ కు ఇటీవల షూటింగ్ లో ప్రమాదం జరిగింది. అందుచేత ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండు మూడు నెలల వరకు రాకపోవచ్చు అని టాక్ వినిపిస్తోంది. దాని వల్ల ఆయన చేయాల్సిన సీన్లు బకాయి వుండిపోతాయని.. మొత్తం మీద సంక్రాంతికి ప్రాజెక్ట్ కె రావడం అనుమానమే అని ప్రచారం జరుగుతుంది. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో మేకర్స్ టెన్షన్ లో పడ్డారని టాక్.

ఇదిలా ఉంంటే.. రామ్ చరణ్, శంకర్ సినిమా సమ్మర్ కి వస్తుంది అనుకున్నారు కానీ.. సంక్రాంతికే విడుదల చేయాలి అనుకుంటున్నారట. ఈ సినిమాను దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి వస్తే.. చరణ్‌, ప్రభాస్ మూవీ మధ్య పోటీపడడం ఖాయం అనిపిస్తుంది. లేదా.. ఈ రెండు సినిమాల్లో ఒకటి వెనక్కు తగ్గుతుందా అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. అయితే.. ఇంకా టైమ్ ఉంది కాబట్టి మరో రెండు మూడు నెలలకు కానీ క్లారిటీ రాకపోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్