Sunday, January 19, 2025
Homeసినిమాస్పీడో మీటర్ కు -'ప్రాజెక్ట్ కే' కు లింకేంటి?

స్పీడో మీటర్ కు -‘ప్రాజెక్ట్ కే’ కు లింకేంటి?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్  ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే,  కీలక పాత్రలో అమితాబ్ నటిస్తుండడం విశేషం. ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ కి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గైడ్ లా వర్క్ చేస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక బడ్జెట్ తో అడ్వాన్స్డ్ స్టొరీ లైన్ తో ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుత కాలానికి ముందుగా భవిష్యత్తులో జరిగే కథగా దీన్నితెరపై ఆవిష్కరించనున్నారని సమచారం. మరో విషయం ఏంటంటే.. ఈ మూవీ మూడో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మహా భారతంలో క్యారెక్టర్స్ ని ఫ్యూచర్ స్టొరీకి ఆపాదించుకొని ఈ కథని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఉపయోగించే కార్లని కూడా కొత్తగానే డిజైన్ చేస్తున్నారంటే.. ఈ కథ పై నాగ్ అశ్విన్ ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా తాజా షెడ్యూల్  త్వరలో మొదలు కాబోతున్న విషయాన్ని నాగ అశ్విన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఇన్ స్టా గ్రామ్ లో క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలో వెహికి  కి వాడే స్పీడో మీటర్ ఫోటో షేర్ చేసి ప్రాజెక్ట్ కే అప్ డేట్ అని పోస్ట్ చేశారు. ఇక ఆ స్పీడో మీటర్ మీద రెవ అనే పేరు ఉంది. దీనికి సినిమాలో ఖచ్చితంగా ఇంట్రస్టింగ్ కనెక్షన్ ఉంటుందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్