Saturday, November 23, 2024
HomeTrending Newsబీహార్లో వెల్లువెత్తిన నిరసనలు.. రైళ్ళు దగ్ధం

బీహార్లో వెల్లువెత్తిన నిరసనలు.. రైళ్ళు దగ్ధం

రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ రిక్రూట్‌మెంట్‌కు వ్యతిరేకంగా బీహార్‌ యువత కదం తొక్కింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నవాడ, జహానాబాద్‌, ముంగర్‌, ఛాప్రాలో పెద్దఎత్తున యువత రోడ్లు ఎక్కారు. అర్రాహ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నిర్వహించిన ధర్నా కాస్తా హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. నిరసన కారులు రైల్వే ట్రాక్‌పై టైర్లు, కర్రలు ఉంచారు. దీంతో రైళ్ల రాకపోకలు అంతరాయం కలిసింది. రైల్వే స్టేషన్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. నవాడ,గోపాల్ గంజ్, ఖైముర్, ముంగేర్ ప్రాంతాల్లో నిరసనకారులు మూడు రైళ్ళను అగ్నికి ఆహుతి చేశారు.

జహానంద్‌లో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. నవాడాలో రోడ్లపై టైర్లు కాల్చివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, నాలుగేండ్లు పనిచేసినతర్వాత తామేం చేయాలి అని ఓ యువకుడు ప్రశ్నించారు. నాలుగేండ్ల తర్వాత మేం ఉపాధి కోల్పోయి రోడ్లపై పడుతాంమని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read : అగ్నిప‌థ్ లో 45వేల మందికి అవకాశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్