Saturday, January 18, 2025
HomeTrending Newsపంజాబ్ లో పోలింగ్ ప్రశాంతం

పంజాబ్ లో పోలింగ్ ప్రశాంతం

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 117 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్.కరుణరాజు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల సమయానికి 63 శాతం పోలింగ్ నమోదైంది. గిద్దర్ బాహా నియోజకవర్గంలో అత్యధికంగా 77.8 శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు ముందు క్యూలైన్లలో ప్రవేశించినవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో 1,304 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 93 మంది మహిళలు కాగా, ఇద్దరు ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. మార్చి 10న ఓట్లు లెక్కించనున్నారు.

అటు, ఉత్తరప్రదేశ్ లో ఆదివారం మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. హాత్రాస్, కాస్ గంజ్, లలిత్ పూర్, ఫిరోజాబాద్, ఎటావ, మెయిన్ పురి, ఫరుక్కాబాద్, కన్నోజ్, ఏటా, ఔరైయా, కాన్పూర్ గ్రామీణ, కాన్పూర్ నగరం, జలావ్, ఝాన్సీ, హమీర్ పూర్, మహోబా జిల్లాల్లోని  59 స్థానాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించగా 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. లలిత్ పూర్ లో అత్యధికంగా 69.61 శాతం ఓటింగ్ నమోదైంది.  కాగా, సాయంత్రం 6 గంటల సమయానికి 61.61 శాతం ఓటింగ్ నమోదైంది. 2.06 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడో దశలో ఎస్పి అధినేత అఖిలేద్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గం కూడా ఉంది.

బుందేల్‌ఖండ్‌లో మూడో దశలో పోలింగ్‌ జరిగిన 5 జిల్లాల్లోని 13 అసెంబ్లీ స్థానాలను 2017లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేయగా ఈ దఫా సమాజ్ వాది పార్టీ నుంచి కమలనాథులకు తీవ్ర స్థాయిలో పోటీ ఎదురైంది. 59 నియోజకవర్గాల్లో 2017లో బీజేపీ 49 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ 9 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒకటి గెలుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్