పూరి జగన్నాథ్ రూపొందించి ఇటీవల విడుదలైన లైగర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అంతే.. విజయ్ దేవరకొండతో స్టార్ట్ చేసిన జనగణమన చిత్రాన్ని ఆపేశారని టాక్ స్టార్ట్ అయ్యింది. లైగర్ రిలీజైన నెక్ట్స్ డేనే విజయ్.. జనగణమన చిత్రాన్ని ఆపేద్దామని ఛార్మికి చెప్పారని సమాచారం. జనగణమన చిత్రం ఆగిపోయినప్పటి నుంచి పూరి నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది హాట్ టాపిక్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి.. హిట్ అంటే ఏంటో తెలియని మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. అందుచేత చిరు, పూరితో సినిమా చేయచ్చు అని టాక్ మొదలైంది. అంతే కాకుండా ఓ నిర్మాత వీరిద్దరి కాంబోని సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. పూరి.. బయట బ్యానర్ లో సినిమాలు చేయడం లేదు. చిరంజీవితో సినిమా అయినా పూరి కనెక్ట్స్ బ్యానర్ లోనే చేయాలని అంటున్నాడట. అందుచేత ఈ సినిమా నిర్మాత ఎవరు అనే దగ్గర ఆగిందట. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో చేయడానికి ఒప్పుకోకపోతే.. నెక్ట్స్ ఆప్షన్ కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేయాలని పూరీ ఫిక్స్ అయ్యాడట.