Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య కోసం ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ!

బాల‌య్య కోసం ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ 107 మూవీ చేస్తున్నారు. దీనికి స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య 108 చిత్రాన్ని సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో చేయ‌నున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు.

ఇదిలా ఉంటే… బాల‌య్య కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ అవుతుంద‌ని తెలిసింది. ఈ క‌థ‌ను ఎవ‌రు రెడీ చేస్తున్నారంటే.. సీనియ‌ర్ స్టార్ రైట‌ర్స్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అని స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి వ‌ర్క్ చేసిన ఈ బ్రదర్స్ బాలయ్య కోసం పవర్ ఫుల్ పొలిటికల్ స్టోరీ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య ఒరిజినాల్టీ సహా యాంగర్ ని బేస్ చేసకుని ఈ కథని అల్లుతున్నారట‌. అయితే.. ఈ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీని ఎవ‌రు డైరెక్ట్ చేస్తారు అనేది తెలియాల్సివుంది.

Also Read : నిర్మాత‌లపై సీరియ‌స్ గా ఉన్న బాల‌య్య‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్