Sunday, January 19, 2025
Homeసినిమాపుష్ప 2 టార్గెట్ ఏమిటి?

పుష్ప 2 టార్గెట్ ఏమిటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన ‘పుష్ప’ అఖండ విజయంతో పార్ట్-2పై కూడా ఎన్నో అంచనాలున్నాయి. సెప్టెంబ‌ర్ నుంచి పుష్ప 2 మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..  ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ వరకూ కేటాయించి రంగంలోకి దిగుతున్నారట. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకున్నారు. సెకండ్ పార్ట్ స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా వారే సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట. అయితే.. అంతకంటే ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తూ మిగతా ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయట.

అందువలన డిజిటల్ రైట్స్ విషయంలోను ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ మూవీ టార్గెట్ ఏంటంటే.. వెయ్యి కోట్ల వరకూ వసూళ్లను టార్గెట్ గా పెట్టుకుంద‌ని తెలిసింది. ఈసారి ఈ సినిమాను మారేడుమిల్లి ఫారెస్టుతో పాటు కొంత భాగాన్ని ఫారిన్ లోను తీయనున్నట్టుగా సమాచారం. ఇక సమంతకు కూడా ముఖ్యమైన పాత్ర దక్కిందని అంటున్నారు. కొత్తగా తీసుకున్నవారి జాబితాలో మనోజ్ బాజ్ పాయ్ .. విజయ్ సేతుపతి .. ప్రియమణి పేర్లు వినిపిస్తున్నాయి. మ‌రి.. పుష్ప 2.. వెయ్యి కోట్ల టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.

Also Read : మేకోవ‌ర్ తో షాక్ ఇచ్చిన అల్లు అర్జున్

RELATED ARTICLES

Most Popular

న్యూస్