Friday, April 19, 2024
Homeసినిమానంద‌మూరి హీరోలు అద‌ర‌గొట్టారుగా..

నంద‌మూరి హీరోలు అద‌ర‌గొట్టారుగా..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ గ‌త సంవ‌త్స‌రం అఖండ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్ లో రూపొందిన అఖండ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 70 కోట్లు షేర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అది కూడా అన్ సీజ‌న్ అయిన డిసెంబ‌ర్ లో ఈ రేంజ్ లో అఖండ మూవీ క‌లెక్ట్ చేయ‌డం విశేషం. ఇది బాల‌య్య కెరీర్ లోనే బిగ్ హిట్ మూవీగా నిలిచింది.

ఇక ఈ సంవ‌త్స‌రం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన‌ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. ఇది రాజమౌళి సినిమా కాబట్టి ఎక్కువగా ఆయనకే క్రెడిట్ ద‌క్కుతుంది కానీ ఇందులో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ పాన్ ఇండియా లెవల్లో మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

తాజాగా నంద‌మూరి కళ్యాణ్ రామ్ కి కూడా హిట్ దక్కింది. నూత‌న ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ డైరెక్ష‌న్ లో రూపొందిన బింబిసార చిత్రం మొదటి వీకెండ్ వసూళ్లతోనే దాదాపుగా పెట్టుబడిని రాబ‌ట్టింది. మరో వారం ఆడితే ఈ సినిమా ఫైనల్ వసూలు ఎంత అనేది తేలుతుంది. ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్ కెరీర్ కి ఇది ఊపు తెచ్చింది. మొన్నటివరకు రేసులో వెనుకబడ్డారు అనుకున్న నందమూరి హీరోలు ఇప్పుడు ఫామ్ లోకి రావ‌డం.. కెరీర్ లో హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ సాధించ‌డం విశేషం.

Also Read : బింబిసారగా మెప్పించిన కల్యాణ్ రామ్! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్