Friday, September 27, 2024
HomeసినిమాPushpa 2 Glimpse: రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతున్న పుష్ప 2 గ్లింప్స్

Pushpa 2 Glimpse: రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతున్న పుష్ప 2 గ్లింప్స్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోన్న మూవీ ‘పుష్ప 2’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ ప్రారంభం అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అయితే.. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్పరాజ్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ గ్లింప్స్ ముఖ్యంగా బన్నీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే.. పుష్ప 2 గ్లింప్స్ ఏంటి..? ఇలా ఉంది..? ఈ గ్లింప్స్ ను సుకుమారే కట్ చేశారా..? అనే అనుమానాలు కూడా వచ్చాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? అంటూ ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసినట్టుగా.. పుష్ప ఎక్కడ..? అంటూ సుకుమార్ పుష్ప 2 పై అందరిలో ఆసక్తి కలిగించాడనే టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే.. పుష్ప 2 గ్లింప్స్ కు సౌత్ కంటే.. నార్త్ లో ఎక్కువ వ్యూస్ రావడం విశేషం. మొత్తానికి రికార్డు బ్రేకింగ్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తూ.. దూసుకెళుతుంది. ఇప్పటి వరకూ 75 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, 2.96 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి.

ఈ రెస్పాన్స్ తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అనేది అర్థం అవుతుంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బడ్జెట్ పరిమితులు లేకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా పుష్ప 2 చిత్రం 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్