Wednesday, June 26, 2024
Homeసినిమా'పుష్ప 2' లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

‘పుష్ప 2’ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2‘. ఈ చిత్రం విదేశాల్లో సైతం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో అల్లు అర్జున్ కు జంటగా రష్మిక మందన్న నటిస్తుంది. ఇటీవల వైజాగ్ లో అల్లు అర్జున్ పై ఇంట్రో సాంగ్ చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా టీమ్ బ్యాంకాక్ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి ఫారెస్టు ఏరియాలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

నెల రోజుల పాటు అక్కడే ఈ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నట్టుగా చెబుతున్నారు. బ్యాంకాక్ ఫారెస్టులో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ముఖ్యంగా సింహంతో బన్నీ ఫైట్ ఎపిసోడ్ ను డిజైన్ చేసిన తీరు ఉత్కంఠను రేకెత్తిస్తుందని టాక్ వినిపిస్తోంది. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, కొత్తగా మరి కొంత మంది స్టార్స్ కూడా జాయిన్ కానున్నారని సమాచారం. పుష్ప చిత్రం బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

అందుచేత పుష్ప 2 సినిమా పై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఎవరు ఎన్ని అంచనాలుతో వచ్చినా పుష్ప 2 అంతకు మించి అనేట్టుగా ఉంటుందట. ఫహిద్ ఫాజిల్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు తెలిసింది. పుష్ప చిత్రం దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 2 చిత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ఇప్పటి నుంచే సినీ పండితులు అంచనాలు వేస్తున్నారు. అందుకనే మేకర్స్ ఈ మూవీ బడ్జెట్ విషయంలో లిమిట్ పెట్టుకోకుండా ఎంతైనా ఖర్చు చేయడానికి రెడీ అంటున్నారు. మరి.. పుష్ప 2 ప్రచారంలో ఉన్నట్టుగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందా అనేది చూడాలి.

Also Read : ‘పుష్ప 2’ ఆఫర్ కి నో చెప్పిన సమంత..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్