Sunday, January 19, 2025
Homeసినిమా'పుష్ప 2' టార్గెట్ అదేనా..?

‘పుష్ప 2’ టార్గెట్ అదేనా..?

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రాజమౌళి అద్భుతం అనేలా ‘ఆర్ఆర్ఆర్‘ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సంచలన చిత్రం.. 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా.. ‘నాటు నాటు’ పాట గోల్డన్ గ్లోబ్ అవార్డ్ అందుకుంది ఇదే ఓ చరిత్ర అనుకుంటే.. ఆస్కార్ అవార్డ్ సైతం దక్కించుకుని కనీవినీ ఎరుగని అద్భుతం అందించి మరోసారి చరిత్ర సృష్టించారు. అంతే కాకుండా.. ఆస్కార్ అవార్డ్ ఎలా సాధించాలో ఇండియన్ సినిమాలకు ఓ దారి చూపించింది.

ముఖ్యంగా ఇండియా తరుపున అధికారికంగా ఆస్కార్ కు పంపించకపోయినా.. ఎలా సాధించొచ్చు అనేది చేసి చూపించింది. దీంతో ఇప్పుడు అందరి టార్గెట్ ఆర్ఆర్ఆర్ అయ్యింది. అవును.. మూవీ సాధించినట్టుగా 1200 కోట్లు సాధించాలి.. ఇంటర్నేషనల్ గా అవార్డులు దక్కించుకోవాలి. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ టార్గెట్ ఇదే. మరీ ముఖ్యంగా ‘పుష్ప 2’ టార్గెట్ ఆర్ఆర్ఆర్ అని టాక్ వినిపిస్తోంది. పుష్ప చిత్రంలోని దేవిశ్రీ పాటలు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇప్పుడు పుష్ప చిత్రానికి సీక్వెల్.. పుష్ప 2 రెడీ అవుతుంది.

పుష్ప చిత్రం బాహుబలి రికార్డులను చాలా చోట్ల షేక్ చేశాడు.ఇప్పుడు కొన్ని ఏరియాల్లో అయినా ఆర్ఆర్ఆర్ రికార్డులను కొట్టాలి అనే టార్గెట్ తో పుష్ప 2 రెడీ చేస్తున్నారట మేకర్స్. పైకి ఎవరూ చెప్పకపోయినా.. ఇదే టార్గెట్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సిటీలోని  ఓ గవర్నమెంట్ గెస్ట్ హవుస్ ను పోలీస్ స్టేషన్ సెట్ గా మార్చి డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు. సినిమా కోసం ఇప్పటికే షూట్ చేసిన ఓ ఫైట్ చాలా అద్భుతంగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. 2024 సమ్మర్ లో ఈ భారీ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరి.. ఆర్ఆర్ఆర్ రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్