Tuesday, September 24, 2024
Homeసినిమా'పుష్ప 3' పై మరో ఇంట్రస్టింగ్ న్యూస్

‘పుష్ప 3’ పై మరో ఇంట్రస్టింగ్ న్యూస్

పుష్ప.. పుష్పరాజ్.. ఎంతటి సంచలనం సృష్టించాడో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం పుష్ప రాజ్ తన సత్తా చూపిస్తున్నాడు. దీంతో పుష్ప 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే.. సుకుమార్ పుష్ప చిత్రాన్ని ఒక పార్ట్ గానే తీయాలి అనుకున్నాడు కానీ.. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పార్ట్ కాదు.. రెండు పార్టులు తీయాలని ఫిక్స్ అయ్యాడు. పుష్ప 1 కి వచ్చిన క్రేజ్ తో పుష్ప 2 చిత్రాన్ని మరింత ఇంట్రస్టింగ్ గా ఉండేలా కథ పై కొన్నాళ్లు కసరత్తు చేసి అదిరిపోయే కథ రెడీ చేశాడు. ఇటీవల పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం అల్లు స్టూడియోస్ లో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు.

అల్లు స్టూడియోస్ లో షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రామోజీ ఫిలింసిటీలో పది రోజులు షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత దుబాయ్ లో షూటింగ్ చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. పుష్ప 1, పుష్ప 2 మాత్రమే కాదట.. పుష్ప 3 కూడా ఉందట. గత కొన్ని రోజులు క్రితం పుష్ప 3 ఉంటుందని ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఫాహిద్ ఫాజిల్ ఓ ఇంటర్ వ్యూలో చెప్పారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పుష్ప 3 గురించి సుకుమార్ కూడా స్పందించారని వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏంటంటే… పుష్ప 1 లో ఒక సాధారణ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడు అన్నది చూపించాడు. ఇక సెకండ్ పార్ట్ లో అతని రూలింగ్ తో పాటుగా అతని డౌన్ ని చూపిస్తారట. ఇక పార్ట్ 2 చివర్లో పార్ట్ 3 కి సంబంధించిన క్లూ వదిలి ముగిస్తారట. పుష్ప 3 కూడా ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అయితే.. పుష్ప 3 కి మాత్రం ఐదేళ్లు టైం తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక జరిగితే.. పుష్ప 3 పై మరింత క్రేజ్ రావడం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్