Sunday, January 19, 2025
Homeసినిమాపుష్ప 2 ప్లాన్ మారిందా?  

పుష్ప 2 ప్లాన్ మారిందా?  

Pushpa2: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ త‌ర్వాత న‌టించిన‌ పుష్ప  సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాడు. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల వసూళ్లు సాధించ‌డం ఓ విశేషం అయితే…బాలీవుడ్ లో 100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేయ‌డం మ‌రో విశేషం. పుష్ప సినిమా బన్నీ టీమ్‌ మీద బాధ్య‌త మ‌రింత‌ పెంచింది. దీంతో పుష్ప సీక్వెల్ విషయంతో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మేకర్స్‌.  మార్చి మొదటివారంలోనే సెకండ్ పార్ట్ షూటింగ్  మొదలు కావాల్సి ఉన్నా ఇంకా షూట్ ప్రారంభం కాలేదు.
ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం ఎక్కువ టైమ్ తీసుకొని కథను మరింతగా ఫైన్ ట్యూన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆడియన్స్‌ మనసుల్లో ముద్ర పడిన క్యారెక్టర్‌ కావటంతో.. ఆ పాత్రను మరింత గ్రాండ్‌గా ప్రజెంట్ చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.  ఏప్రిల్‌లో సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి షూటింగ్ కోసమే 8 నెలల సమయం కేటాయించాలి అనుకుంటున్నార‌ట‌.
డిసెంబర్‌ కల్లా షూటింగ్ అంతా పూర్తి చేసేలా పర్ఫెక్ట్‌గా షెడ్యూల్స్ ప్లాన్స్‌ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయితే.. మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారని స‌మాచారం. అయితే.. డిసెంబ‌ర్ లో క్రిస్మ‌స్ కి పుష్ప పార్ట్ 1 రిలీజ్ చేసిన‌ట్టుగానే పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ప్లాన్ మారింది. నెక్ట్స్‌ ఇయర్‌ సమ్మర్ టార్గెట్ గా పుష్ప 2 రెడీ చేస్తున్నార‌ట‌.
RELATED ARTICLES

Most Popular

న్యూస్