Saturday, January 18, 2025
Homeసినిమాసోషల్ మీడియా వార్తలు ఖండించిన పీపుల్స్ స్టార్

సోషల్ మీడియా వార్తలు ఖండించిన పీపుల్స్ స్టార్

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి రూపొందిస్తున్న తాజా చిత్రం రైతన్న. ప్రస్తుత ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ కారణంగా రైతులు ఎలాంటి అవస్థలు పడుతున్నారనేది ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు. త్వరలో రైతన్న విడుదలకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. నారాయణమూర్తి వ్యక్తిగత జీవితం గురించి ఆవేదన వ్యక్తం చేశారు.

“సొంత ఆస్తి అంటూ ఏదీ లేని కనీసం ఇల్లు లేదు.. భార్య లేదు.. సూటూ బూటూ వేసుకోడు.. చివరకు ఒక బైక్ కూడా లేదని అన్నారు. రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లి సినిమాల్లో నటించే నారాయణ మూర్తి. జీవితంలో మాత్రం నటించడని’ అన్నారు. గద్దర్ అలా అనడంతో నారాయణమూర్తి ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే.. ఈ వార్తలు మరీ ఎక్కువుగా రావడంతో పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి స్పందిస్తూ.. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నానని గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

“పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నాను. ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి. అలాంటిది ఇంటి అద్దె కట్టుకోలేనా? అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి. కోట్లు సంపాదించాను. నా వరకు సరిపడా దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చాను” అని ఆర్.నారాయణ మూర్తి తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్