Sunday, January 19, 2025
Homeసినిమాపేదవాడికి వినోదం లేదు: నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు

పేదవాడికి వినోదం లేదు: నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు

భారతదేశంలో పేదవాడికి వినోదం లేదు అంటూ ఓటిటి ప్లాట్ ఫోమ్స్ పై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంచనల వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ… ‘ఇటీవల ఓ టి టి లో రిలీజ్ అయిన ‘నారప్ప’ తెలుగు రాష్ట్రాలలో  కేవలం 25 శాతం మంది మాత్రమే చూసారు కానీ మిగతా 75 శాతం మంది చూడలేకపోయారు. మధ్య తరగతి బడుగు వర్గాల ఇళ్ళల్లో ఓ టి టి లేదు.. మరి వాళ్ల కెప్పుడు ఇస్తారు వినోదం సినిమా థియేటర్ లో సినిమా చూడడం ఒక పండుగ’ అన్నారు.

“థియేటర్ అనుభూతే వేరు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞపి. వెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని కోరుతున్నాను. కరోనా తో ఫైట్ చెయ్యాల్సిందే అందరూ.. పేద వాడికి వున్న ఒకే ఒక వినోదం థియేటర్. సినిమా బతకాలి థియేటర్స్ బతకాలి. సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమా థియేటర్ ఓపెన్ అయేటట్టు చూడాలి. మనిషి వున్నంత కాలం థియేటర్ వుంటుంది. థియేటర్ లేకపోతే స్టార్ డమ్ లు వుండవు. పరిశ్రమ పెద్దలు సినిమాలను ఓ టి టి కి రిలీజ్ చెయ్యకుండా థియేటర్ లో రిలీజ్ అయ్యే టట్టు చూడాలి” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్