ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. తన మొదటి కూతురు పల్లవికి దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు. చదువుకునే రోజుల్లో ఆమె పవన్ అనే యువకుడిని ప్రేమించింది. బొల్లవరంలోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు.
ఏ ఆడపిల్లకు అయినా మనసొక చోట, మనువు మరోచోట చేయరాదని, పూర్తి పరిపక్వతతో ఆలోచించే అమ్మాయిని… వారి అభిప్రాయాలను, స్వేఛ్చను గౌరవించాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రులకూ ఉందని రాచమల్లు అన్నారు. కూతురు సరైన నిర్ణయం తీసుకోకపోతే సలహా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందన్నారు.