Monday, January 20, 2025
HomeTrending Newsఒడిశాలో ర్యాగింగ్, అమ్మాయితో ఆకతాయిల ఆగడాలు

ఒడిశాలో ర్యాగింగ్, అమ్మాయితో ఆకతాయిల ఆగడాలు

Raging in Odisha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్ పై కొత్త చట్టాలు తీసుకు రావటం… నాలుగు రోజుల హడావిడి తరవాత నిర్లక్ష్యం చేయటం సాధారణంగా మారింది. ర్యాగింగ్ వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయినపుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవటం జరుగుతోంది.  దేశంలో ప్రతి రోజు ఏదో ఒక రాష్ట్రంలో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం షరామాములైంది.  ఇదే కోవలో ఒడిశాలో కొందరు ఆకతాయిలు ర్యాగింగ్ పేరుతో అమ్మాయిలతో ఇష్టారీతిగా ప్రవర్తించిన వైనం విమర్శలకు దారితీస్తోంది.

ఒడిశా బరంపురంలోని బినాయక్ ఆచార్య ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు రెచ్చిపోయారు. అదే కాలేజీలో చదువుతున్న అమ్మాయిని ఐదుగురు అబ్బాయిలు దారుణంగా ర్యాగింగ్ చేశారు. ఓ విద్యార్థి ఆమెకు ముద్దు పెట్టాడు. అక్కడే చాలా మంది అమ్మాయిలు ఉన్నా ఎవరూ అడ్డుకోలేదు. ఇక ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీంతో పోలీసులు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.

Also Read: ఒడిశాలో మావోల మెరుపు దాడి

RELATED ARTICLES

Most Popular

న్యూస్